Karthikeya2 హీరోయిన్ ఫిక్స్ ?

Tuesday,December 01,2020 - 05:43 by Z_CLU

త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఆసక్తికరమైన సీక్వెల్స్ లో ‘Karthikeya2‘ ఒకటి. నిఖిల్ -చందూ మొండేటి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నివేత పెతురాజ్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం నివేత పెతురాజ్ తో ఓ వెబ్ మూవీ చేస్తున్నాడు చందూ మొండేటి. ఆ సినిమా సెట్ లోనే నివేతకు కథ వినిపించి ఈ సినిమాకు కూడా హీరోయిన్ గా లాక్ చేసుకున్నాడట. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. ‘కార్తికేయ’లో నిఖిల్ -స్వాతిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మరి సీక్వెల్ లో నిఖిల్ – నివేత పెతురాజ్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై TG విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

Also Check కార్తికేయ 2 లో నిఖిల్ రోల్ అదే ?