మెగా హీరోతో మరో సినిమా ?

Wednesday,March 11,2020 - 05:40 by Z_CLU

‘ప్రతి రోజు పండగే’ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న సాయి ధరం తేజ ప్రస్తుతం సుబ్బు అనే డెబ్యూ డైరెక్టర్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’  సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే దేవకట్టా డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా నివేత పెతురాజ్ ని ఎంపిక చేసారట మేకర్స్.

తేజ్ తో కలిసి ‘చిత్రలహరి’ సినిమాలో నటించింది నివేత. ఆ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే  సినిమాలో పెర్ఫార్మెన్స్ ని స్కోప్ ఉన్న హీరోయిన్ కోసం చూస్తూ ఫైనల్ గా నివేతని సెలెక్ట్ చేసాడట దేవకట్టా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను పుల్లారావు , భగవాన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా లాంచ్ కానుంది.