జయలలితగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్

Wednesday,December 05,2018 - 04:31 by Z_CLU

జయలలిత బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ బయోపిక్ లో జయలలితగా నిత్యా మీనన్ నటించనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో జయలలిత లైఫ్ లోని కీలక సందర్భాలను తెరకెక్కించనున్నారు మేకర్స్. అయితే ఈ రోజు జయలలిత 2 వ వర్థంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాకి ‘ ద ఐరన్ లేడీ’ అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు.

కంప్లీట్ గా జయలలిత అటైర్ లో ఉన్న నిత్యామీనన్ ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్  చాయిస్ అనిపించుకుంటుంది. టైటిల్ తో పాటు పోస్టర్ పై ‘ఇండియాస్ మార్గరెట్ థాచర్’ అనే ట్యాగ్ లైన్ ని కూడా మెన్షన్ చేయడంతో ఈ పోస్టర్ మరింత ప్రామిసింగ్ అనిపిస్తుంది. ఈ బయోపిక్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజవుతుంది.

ప్రస్తుతం ఈ బయోపిక్ లో కీ రోల్స్ ప్లే చేయనున్న నటీనటులను ఎంపిక చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. ఆ డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ఈ బయోపిక్ కి A. ప్రియదర్శిని డైరెక్టర్. పేపర్ టేల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ బయోపిక్ తెరకెక్కనుంది.