నాగార్జున సినిమాలో నిత్యమీనన్

Monday,February 13,2017 - 06:15 by Z_CLU

నాగార్జున రాజుగారి గది 2  ఫిబ్రవరి 12 నుండి సెట్స్ పైకి వచ్చేస్తుంది. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తుంది. దీంతో పాటు నాగ్ సరసన నటించబోయే హీరోయిన్ మ్యాటర్ లో ఒక ఇంటరెస్టింగ్ పేరు తెరపైకి వచ్చింది.

నాగ్ తన కరియర్ లోనే ఫస్ట్ టైం హారర్ జోనర్ లో నటిస్తున్నాడు. క్యారెక్టర్ పెద్దగా రివీల్ కాలేదు కానీ సమంతా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. అయితే ఈ సినిమాలో నాగ్ సరసన నిత్యా మీనన్ నటించనుందనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఫిలిం మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి అప్ డేట్ అయితే రాలేదు కానీ, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హై ఎండ్ పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్నది కావడంతో, ఓంకార్, నాగ్… నిత్యామీనన్ ని ప్రిఫర్ చేస్తున్నట్టు సమాచారం. క్యారెక్టర్ కి స్కోప్ ఉండాలి కానీ నిత్యామీనన్ పర్ఫామెన్స్ గురించి ఇంకా మాట్లాడాల్సిందేముంటుంది. నిత్యా మీనన్… నిత్యా మీననే అనిపించుకోవడం గ్యారంటీ. కాకపోతే ఈ విషయంలో ఫిం మేకర్స్ మైండ్ లో ఎగ్జాక్ట్ గా ఏం నడుస్తుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.