ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తున్న నిత్యా మీనన్ కొత్త సినిమా

Tuesday,January 30,2018 - 11:02 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నిత్యా మీనన్ కొత్త సినిమా ‘ప్రాణ’. ఈ సినిమాలో అనురాధ గా మెస్మరైజ్ చేయనుంది నిత్య.  V.K. ప్రకాష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో నిత్యా మీనన్ లీడ్ రోల్ ప్లే చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే, ఈ సినిమా మొత్తంలో తానొక్కతే ఉండటం, సినిమాపై కాన్సంట్రేషన్ నిలిచేలా చేస్తుంది.

 

ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ‘మ్యూజిక్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే బుక్ రాసే రైటర్ లా కనిపించనుంది. ఆ బుక్ తన లైఫ్ లో ఎలాంటి కాంఫ్లిక్ట్ క్రియేట్ చేయనుంది..? ఆ తరవాత ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో పాటు, ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుందీ సినిమా.

P.C. శ్రీరామ్ సినిమాటోగ్రాఫీ చేస్తున్న ఈ సినిమాతో కొత్త సౌండ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాని అనిత రాజ్, ప్రవీణ్ S. కుమార్ సంయుక్తంగా రాజ్ ప్రొడక్షన్స్ తో పాటు రియల్ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. సౌత్ ఇండియాలోని బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిత్యా మీనన్ కరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలవడం ఖాయమంటున్నారు ఫిల్మ్ మేకర్స్.