గీతగోవిందం.. ఈ ఇద్దరు కూడా అదుర్స్

Friday,August 17,2018 - 12:47 by Z_CLU

గీతగోవిందం సినిమా సూపర్ హిట్ అయింది. విజయ్ దేవరకొండ, రష్మిక యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రైటింగ్, ప్రొడక్షన్.. ఇలా అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా ఉంది. అయితే వీటితో పాటు మరో మనం పట్టించుకోవాల్సిన ఎలిమెంట్ ఇందులో ఇంకోటి ఉంది. వాళ్లే నిత్యామీనన్, అను ఎమ్మాన్యుయేల్.

గీతగోవిందం సినిమాలో రష్మిక మాత్రమే కాదు, నిత్యామీనన్-అను ఎమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ ఎంట్రీ కంటే ముందే వస్తుంది అను ఎమ్మాన్యుయేల్. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేయడానికి ఈ క్యారెక్టర్ బాగా ప్లస్ అయింది.

ఇక సినిమాలో నిత్యామీనన్ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాతో సంబంధం లేనట్టు అనిపించినప్పటికీ, కీలకమైన క్లయిమాక్స్ కు కారణం నిత్యానే. ఈమె సలహాపైనే సినిమా క్లయిమాక్స్ కు చేరుతుంది. అలా గీతగోవిందం సినిమా సక్సెస్ లో నిత్యామీనన్, అను ఎమ్మాన్యుయేల్ కు కూడా షేర్ దక్కుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. రెండో రోజు కూడా ఈ మూవీకి హౌజ్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. ఈ వీకెండ్ కు గీతగోవిందం సినిమా కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తోంది ట్రేడ్.