RangDe - సెట్స్ పైకి కొత్త పెళ్లికొడుకు

Wednesday,September 09,2020 - 04:21 by Z_CLU

కరోనా/లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది ‘రంగ్ దే’ సినిమా. నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

మూవీకి సంబంధించి నితిన్ పెళ్లి సందర్భంగా ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. RangDe Teaser కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ రిలీజ్ చేసిన టైమ్ లోనే సంక్రాంతికొస్తామంటూ ఎనౌన్స్ చేశారు.

ఇప్పుడా టార్గెట్ ను అందుకోవాలంటే ఎట్టిపరిస్థితుల్లో షూట్ స్టార్ట్ చేయాల్సిందే. కనీసం ఈ నెలాఖరు నుంచి షూట్ స్టార్ట్ చేయకపోతే కొత్త పెళ్లికొడుకు (Nithin) సంక్రాంతికి రావడం కష్టమే. అందుకే నితిన్ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.