ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన "లై"

Friday,August 11,2017 - 11:01 by Z_CLU

యూత్ స్టార్ నితిన్, బ్యూటిఫుల్ బేబ్ మేఘా ఆకాష్ జంటగా నటించిన లై సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు, మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన లై సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు.

14రీల్స్ బ్యానర్ పై తెరకెక్కిన లై సినిమా ఓవర్సీస్ లో గ్రాండ్ గా విడుదలైంది. నార్త్ అమెరికాలో 125 లొకేషన్లలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ జరగ్గా, ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి లై సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మోస్ట్ స్టయిలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన లై సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు రీ-రికార్డింగ్ కు ఆడియన్స్ నుండి  బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. వీటితో పాటు మూవీలో అర్జున్ ఎప్పీయరెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. నితిన్ తర్వాత లై సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా అర్జున్ నిలిచాడంటున్నారు ఆడియన్స్.