Check - రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నితిన్

Friday,January 22,2021 - 06:07 by Z_CLU

నితిన్ అప్ కమింగ్ మూవీ చెక్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ లాక్ అయింది. ఫిబ్రవరి 19న చెక్ మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వస్తోంది చెక్ మూవీ. ఇప్పటివరకు నితిన్ ట్రై చేయని క్యారెక్టర్-కథ ఇది. ఇందులో ఉరిశిక్ష పడిన ఖైదీగా, వరల్డ్ ఛెస్ ప్లేయర్ గా నితిన్ కనిపించబోతున్నాడు.

Nithin Check releases on February 19

రకుల్, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. కల్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.