Check - గోవాలో నితిన్
Sunday,February 14,2021 - 02:45 by Z_CLU
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఇటీవలే ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ గీతాన్ని గోవాలో చిత్రీకరించారు.

గోవాలో నితిన్, ప్రియా ప్రకాశ్ వారియర్‌పై చిత్రీకరించిన పాటతో చిత్రీకరణ అంతా పూర్తయింది. మూడు రోజులు అందమైన లొకేషన్లలో ఈ పాటను తెరకెక్కించారు. దీనికి కల్యాణి మాలిక్ మంచి బాణీ అందించారు.

స్టోరీలైన్ కు తగ్గట్టు సినిమాలో ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరింది. అందర్నీ అలరించేలా ఈ పాట ఉంటుంది. సిచ్యుయేషన్ కుదరక మరో పాటను పెట్టలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి, ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

నితిన్ ఇందులో ఉరిశిక్ష పడిన ఖైదీగా కనిపించబోతున్నాడు. అతడ్ని బయటకు తీసుకొచ్చే లాయర్ పాత్రలో రకుల్, ప్రేయసి పాత్రలో ప్రియా ప్రకాష్ నటిస్తున్నారు.