మోహన్ రంగపై నితిన్ కు ఎందుకంత నమ్మకం ?

Tuesday,April 03,2018 - 06:37 by Z_CLU

నితిన్ నటించిన ‘ఛల్ మోహన రంగ’ ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. హిలేరియస్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మోహన్ రంగ తన కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుందంటున్నాడు. ఇంతకీ నితిన్ కు ఈ సినిమాపై ఎందుకంత నమ్మకం.


త్రివిక్రమ్ స్టోరీ:

నితిన్ నమ్మకానికి మెయిన్ రీజన్ ఇదే. ‘ఛల్ మోహన రంగ’ కథ త్రివిక్రమ్ దే. ‘లై’ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తరవాత హిలేరియస్ లవ్ ఎంటర్ టైనర్ చేయాలనే ఆలోచనలో ఉన్న నితిన్ కి, ఈ స్టోరీ చేయమని సజెస్ట్ చేసింది కూడా త్రివిక్రమే. లవ్, కామెడీ, ఇమోషన్.. ఇలా అన్నీ మిక్స్ అయిన ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ ఇది. పైగా డైలాగ్స్ లో కూడా త్రివిక్రమ్ ఫ్లేవర్ కనిపిస్తోంది. మూవీకి సంబంధించి ఆడియన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఇదే.


హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ:

సినిమా సక్సెస్ పై నితిన్ కు నమ్మకాన్ని పెంచిన మరో ఫాక్టర్ ఇది. ‘లై’ సినిమా తర్వాత వెంటనే మేఘ ఆకాష్ కు నితిన్ మరోఛాన్స్ ఇచ్చాడంటే వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అయిందో అర్థంచేసుకోవచ్చు. ఇక ఛల్ మోహన్ రంగలో నితిన్-మేఘ పెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకున్నారు. ట్రయిలర్స్ లో ఈ జంటను చూసిన ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.

లొకేషన్స్:

నితిన్ నమ్మకానికి మరో రీజన్ అందమైన లొకేషన్లు. అమెరికాతో పాటు ఊటీలోని అందమైన లొకేషన్లలో తెరకెక్కింది ఛల్ మోహన రంగ. కలర్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి నటరాజ సుబ్రహ్మణ్యం ఫోటోగ్రఫీ అతిపెద్ద  ఎసెట్ కానుంది.


డైరెక్టర్:

స్వతహాగా పాటలు రాసే కృష్ణచైతన్యకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్ పై కూడా మంచి పట్టుంది. రౌడీ ఫెలో సినిమా చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమౌతుంది. ఛల్ మోహన్ రంగ సినిమాను కూడా ఈ కుర్ర డైరక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు. హీరోహీరోయిన్లను అందంగా చూపించడంతో పాటు డైలాగ్స్ పై ప్రత్యేక దృష్టిపెట్టాడు. సినిమాలో డైలాగ్స్ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తాయి.


థమన్ మ్యూజిక్:

నితిన్ నమ్మకాన్ని రిలీజ్ కు ముందే నిజం చేశాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. ఇప్పటికే ఆడియో పెద్ద హిట్. గ..ఘ మేఘ సాంగ్ తో పాటు పెద్ద పులి సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. వీటితో పాటు మిగతా పాటలు కూడా క్లిక్ అయ్యాయి. సాంగ్స్ ఒకెత్తయితే, ఈమధ్య కాలంలో రీరికార్డింగ్ తో కూడా మేజిక్ చేస్తున్నాడు తమన్. సో.. ఛల్ మోహన్ రంగ మూవీ అటు సాంగ్స్, ఇటు రీరికార్డింగ్ పరంగా ది బెస్ట్ అనిపించుకోనుంది.


కామెడీ:

‘ఛల్ మోహన రంగ’ సినిమాలో కథ తర్వాత బలమైన ఎలిమెంట్ కామెడీ. ఈ సినిమాలో హిలేరియస్ కామెడీ ఉండబోతోందనే విషయం ట్రయిలర్స్ చూస్తేనే అర్థమౌతోంది. నితిన్ కూడా అదే చెబుతున్నాడు. ఓ లవ్ సబ్జెక్ట్ కు అదిరిపోయే సాంగ్స్, అల్టిమేట్ కామెడీ యాడ్ అయితే ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.


పవన్ కళ్యాన్ :

సినిమాలో అన్నీ ఒకెత్తు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో ఎత్తు. తన ప్రత్యక్ష దైవం పవన్ రంగంలోకి దిగడంతో ఇక నితిన్ ఎలాంటి డౌట్స్ పెట్టుకోలేదు. నేరుగా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతల్లో పవన్ కూడా ఒకరు. పవర్ స్టార్ లాంటి వ్యక్తి నిర్మాతగా మారి సినిమా తీశాడంటే, ఈ కథ పవన్ కు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా పవన్ ఇదే చెప్పాడు. సో.. నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసే సినిమా ఇది.


నితిన్:

పైన చెప్పుకున్న ఎలిమెంట్స్ తో పాటు నితిన్ కు తనపై తనకు అపార నమ్మకం. మంచి ప్రేమకథ పడితే విశ్వరూపం చూపించేస్తాడు. అందుకే ఛల్ మోహన్ రంగ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ జానర్ లో నితిన్ సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అని ఫిక్సయి ఉన్నారు ఫ్యాన్స్. ఓవర్ సీస్ లోను నితిన్ కి మంచి క్రేజ్ ఉండటంతో, సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. ప్రేమకథ చేసిన ప్రతిసారి నితిన్ సక్సెస్ అందుకున్నాడు. సో.. ఆ పాజిటివ్ సెంటిమెంట్ కూడా ఛల్ మోహన్ రంగపై ఉంది.