ఛల్ మోహన్ రంగ ఆడియో రిలీజ్

Sunday,March 18,2018 - 11:02 by Z_CLU

ఉగాది సందర్భంగా ఛల్ మోహన్ రంగ సినిమాకు సంబంధించి కంప్లీట్ ఆడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సినిమా జూక్ బాక్స్ అందుబాటులో ఉంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.

సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. వీటిలో పెద్దపులి, వారం, గ.ఘ..మేఘ సాంగ్స్ ఇప్పటికే విడుదల కాగా.. వెరీ వెరీ శాడ్, మియామి, అర్థం లేని నవ్వు అనే సాంగ్స్ కొత్తవి. టోటల్ సాంగ్స్ లో పెద్దపులి సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్

ఈ పాట తర్వాత గ..ఘ..మేఘ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ప్రతి పాట దేనికదే భిన్నంగా ఉండేట్టు తమన్ మరోసారి తన మార్క్ చూపించాడు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకుడు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ సమకూర్చడం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించడం ఈ సినిమాకు హైలెట్స్. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది ఛల్ మోహన్ రంగ.