ఛల్ మోహన్ రంగ ఫస్ట్ డే కలెక్షన్

Friday,April 06,2018 - 02:25 by Z_CLU

నితిన్ కెరీర్ లోనే రెండో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది ఛల్ మోహన్ రంగ. నిన్న రిలీజైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 7 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక డిస్ట్రిబ్యూషన్ షేర్ కింద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 4 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నైజాంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఓవరాల్ గా మొదటి రోజు వసూళ్లతో కంపేర్ చేసుకుంటే అ..ఆ సినిమా తర్వాత అత్యథిక వసూళ్లు సాధించిన నితిన్ సినిమా ఇదే. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ ఫాక్టర్స్ కలిసిరావడం, రిలీజ్ కు ముందే పాటలు హిట్ అవ్వడం ఈ సినిమా వసూళ్లకు కీలకంగా మారింది. అటు ఓవర్సీస్ లో కూడా ఛల్ మోహన్ రంగ డీసెంట్ గా ప్రారంభమైంది. ఫస్ట్ డే టాక్ పాజిటివ్ గా ఉండడంతో.. మూవీ వసూళ్లు నెమ్మదిగా పెరిగే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్

నైజాం – రూ. 1.06 కోట్లు
సీడెడ్ – రూ. 0.45 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.18 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు

మొదటి రోజు షేర్ – రూ. 2.88 కోట్లు