నితిన్ కెరీర్ లోనే భారీ ఓవర్సీస్ రిలీజ్

Thursday,August 10,2017 - 12:30 by Z_CLU

హీరో మార్కెట్ వాల్యూను డిసైడ్ చేయాలన్నా, సినిమా విజయాన్ని శాసించాలన్నా ఓవర్సీస్ వసూళ్లు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. డొమస్టిక్ గా సక్సెస్ అవ్వడంతో పాటు యూఎస్ లో కూడా కాసులు కురిపించినప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందుకే లై సినిమాను ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

నితిన్ కెరీర్ లోనే ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమాగా లై రికార్డు సృష్టించింది. ఒక్క ఉత్తర అమెరికాలోనే 125 లొకేషన్లలో లై సినిమా విడుదలకాబోతోంది. ఈ మేరకు స్క్రీన్స్ ను లాక్ చేశారు. ఇక ప్రీమియర్స్ కోసం ఏకంగా 107 లొకేషన్లను ఫిక్స్ చేశారు. ఈ లొకేషన్లతో జాబితాను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. అంటే.. అమెరికాలో తెలుగువాళ్లు ఉండే దాదాపు ప్రతి ఇంపార్టెంట్ లొకేషన్ లో ‘లై’ ప్రీమియర్ పడబోతోందన్నమాట.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కాయి. రేపు మరో రెండు సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కీలకమైన థియేటర్లను దక్కించుకోవడంలో 14 రీల్స్ నిర్మాతలు పైచేయి సాధించారు. మరోవైపు సినిమా సాంగ్స్, ట్రయిలర్ సూపర్ హిట్ అవ్వడంతో.. లై కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.