Nithin Andhadhun Remake - టైటిల్ ఫిక్స్

Tuesday,March 30,2021 - 12:23 by Z_CLU

నితిన్ రీమేక్ సినిమాకు టైటిల్ ఫిక్స్ !

ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమాల్లో ‘అంధాదున్’ రీమేక్ ఒకటి. మేర్లపాక గాంధి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘మాస్ట్రో’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసి ప్రకటించారు.

నితిన్ పుట్టినరోజుని పురస్కరించుకొని టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నితిన్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ టీజర్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సినిమాలో కీ బోర్డ్ ప్లేయర్ గా కనిపించనున్నాడు నితిన్. మ్యూజిక్ కి రిలేటెడ్ క్యారెక్టర్ కావడంతో సినిమాకు ‘మాస్ట్రో’ అనే టైటిల్ పెట్టారు.

నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఓ కీ రోల్ ప్లే చేస్తుంది. శ్రేశ్ట్ మూవీస్ బేనర్ పై తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమా జూన్ 11న థియేటర్లలోకి రానుంది.

nithin mastro movie nithin mastro movie nithin mastro movie