నితిన్ నుంచి రెండు సినిమాలు ...

Sunday,December 31,2017 - 02:06 by Z_CLU

ప్రస్తుతం ఏడాదికో సినిమాతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న యూత్ స్టార్ నితిన్ వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న నితిన్ మార్చ్ నుంచి శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమాతో వేసవిలో సందడి చేయనున్న నితిన్… ఆగస్టు లో శ్రీనివాస కళ్యాణం సినిమాతో హంగామా చేయనున్నాడు. సో వచ్చే ఏడాది రెండు సినిమాలతో థియేటర్స్ లో దిగబోతున్నాడన్నమాట నితిన్.