సూపర్ హిట్ రీమేక్ లో నితిన్

Tuesday,September 03,2019 - 02:02 by Z_CLU

ప్రస్తుతం నితిన్ చేతిలో 3 సినిమాలున్నాయి. అయినప్పటికీ ఈ హీరో జోరు తగ్గడం లేదు. తాజాగా మరో ప్రాజెక్టుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అంధాదున్ రీమేక్ లో నితిన్ హీరోగా నటించే ఛాన్స్ ఉంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు.

బాలీవుడ్ లో పెద్ద హిట్ అయింది అంధాదున్. అయితే అది హిట్ అయినప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చిందో అప్పుడు తెలుగు మేకర్స్ కన్ను దానిపై పడింది. అలా భారీ కాంపిటిషన్ మధ్య అంధాదున్ రీమేక్ రైట్స్ ఠాగూర్ మధు వశమయ్యాయి.

ఇక నితిన్ విషయానికొస్తే.. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేస్తున్నాడు ఈ హీరో. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో, రకుల్ హీరోయిన్ గా మరో సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ 3 ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అంధాదూన్ రీమేక్ పై ఓ క్లారిటీ వస్తుంది.