హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న నితిన్

Monday,May 04,2020 - 11:57 by Z_CLU

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘రంగ్ దే’ అనే లవ్ స్టోరీ చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా పూర్తవ్వకుండానే మరోసారి కీర్తినే రిపీట్ చేస్తున్నాడు నితిన్. అవును.. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ‘పవర్ పేట’ అనే సినిమా చేస్తున్న నితిన్ ఆ సినిమాలో కీర్తితో మరోసారి నటించబోతున్నాడు.

నితిన్ కి హీరోయిన్ గా కొంతమందిని అనుకున్న దర్శకుడు కృష్ణచైతన్య ఫైనల్ గా కీర్తి సురేష్ కే ఓటేశాడట. దీంతో కీర్తి చేతికి మరో తెలుగు ప్రాజెక్ట్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు అమ్మడు సంతకం కూడా పెట్టేసిందని టాక్.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.