In Pics: ఓ ఇంటివాడైన నితిన్

Monday,July 27,2020 - 02:04 by Z_CLU

హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు. నిన్న రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్ లో నితిన్-షాలినీ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు నితిన్. “మొత్తానికి ఓ ఇంటి వాడినయ్యా.. మీ దీవెనలు కావాలి” అంటూ పోస్ట్ పెట్టాడు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం తక్కువ మంది అతిథులు హాజరైనప్పటికీ.. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరిగింది.

పెళ్లికి ఒక రోజు ముందు జరిగే వేడుకలో నితిన్ ఫేవరెట్ హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఇక పెళ్లికి సీఎం కేసీఆర్ తరఫున కవిత హాజరయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి సాయితేజ్, వరుణ్ తేజ్ హాజరయ్యారు.

ఏప్రిల్ లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నితిన్. పైగా దుబాయ్ లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. సడెన్ గా కరోనా రావడం, లాక్ డౌన్ పడ్డంతో పెళ్లి వాయిదాపడింది. అలా కాస్త ఆలస్యంగా నిన్న వైవాహిక జీవితంలోకి ఎంటరయ్యాడు ఈ హీరో.