నితిన్ స్పీడ్ పెంచేశాడు

Sunday,January 28,2018 - 11:06 by Z_CLU

యూత్ స్టార్ నితిన్ స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నితిన్ ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ మినహా షూటింగ్ ఫినిష్ చేసేశాడు. పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమాతో త్వరలో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్న నితిన్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాతో సమ్మర్ లో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వనున్న నితిన్ ఆగస్ట్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా ఫినిషింగ్ స్టేజికి రాగానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండో సినిమాలను లైన్ లో పెట్టేసి ఏడాదికి రెండు సినిమాలతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవ్తున్నాడన్నమాట నితిన్.