Macherla Niyojakavargam - సెంటిమెంట్ యాడ్ చేసిన నితిన్

Sunday,July 31,2022 - 09:39 by Z_CLU

Nithin Speech at Macherla Niyojakavargam Trailer Launch

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ చేస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, ‘మాచర్ల యాక్షన్ ధమ్కీ’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.

గుంటూరులోని బ్రాడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా హాజరయ్యారు. రారా రెడ్డి పాటలోని ‘రానురాను అంటుంది చిన్నదోయ్’ పాపులర్ బీట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది.

ఈ వేడుకలో నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు. ఈ వేదికపై మాట్లాడిన నితిన్.. మాచర్ల నియోజకవర్గం సినిమాకు గుంటూరుకు సెంటిమెంట్ కనెక్ట్ చేశాడు.

“సై హిట్ తర్వాత గుంటూరు వచ్చాను. అప్పుడు ఇదే ప్రేమ ఇచ్చారు. తర్వాత అఆ హిట్ తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ప్రేమ చూపించారు. ఈసారి సినిమా ముందే వచ్చాను. మీ ఎనర్జీ చూస్తుంటే ‘మాచర్ల నియోజకవర్గం’ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. మీ ఆదరణ , ప్రేమ లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలి. ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ ఎలా వుందో సినిమా కూడా అంతే ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఆగస్ట్ 12 సినిమా వస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది. సినిమాలో పాటలని హిట్ చేశారు. అలాగే సినిమాని కూడా చూసి పెద్ద హిట్ చేయండి. ఆగస్ట్ 12 థియేటర్ లో డైరెక్ట్ యాక్షనే”