నితిన్ నిశ్చితార్థం పూర్తి.. ఏప్రిల్ లో పెళ్లి

Saturday,February 15,2020 - 03:29 by Z_CLU

ఈరోజు నితిన్ నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని ఈ భీష్మ హీరో స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు.. ఎంగేజ్ మెంట్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశాడు.

నితిన్-షాలిని 8 ఏళ్లుగా ఒకరికొకరు పరిచయం. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ ను ఒప్పించి ఇప్పుడు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన షాలినీ, లండన్ లో బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ చేసింది.

నితిన్-షాలిని పెళ్లి ఏప్రిల్ 16న దుబాయ్ లో జరుగుతుంది. ఇవాళ్టి నుంచి పెళ్లి పనులు ప్రారంభించబోతున్నట్టు నితిన్ ప్రకటించాడు. పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే చేసుకుంటాడు నితిన్. పెళ్లి తర్వాత అదే నెలలో టాలీవుడ్ కు గ్రాండ్ పార్టీ ఇస్తాడు.

వచ్చే వారం నితిన్ నటించిన భీష్మ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం ఈ హీరో రంగ్ దే అనే సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఛెక్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.