లవ్ మేటర్ బయటపెట్టిన నితిన్

Friday,February 14,2020 - 01:26 by Z_CLU

వాలంటైన్స్ డే సందర్భంగా నితిన్ తన లవ్ మేటర్ ను బయటపెట్టాడు. చాన్నాళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న ఈ హీరో, ఎట్టకేలకు ఆ వివరాల్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు.

“అంతా మాది ఎరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. కానీ మాది లవ్ మ్యారేజ్. నేను, తను (షాలిని) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా మధ్య ఇప్పటికే 5 వాలంటైన్స్ డేలు గడిచిపోయాయి. మా ప్రేమను ఇంట్లో ఒప్పుకోవడంతో ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అయింది.”

షాలిని తనకు 8 ఏళ్లుగా తెలుసని, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైందని చెప్పుకొచ్చిన నితిన్.. ఐదేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామంటున్నాడు. అందర్లా తను మోకాళ్లపై నిల్చొని తన ప్రేమను ప్రపోజ్ చేయలేదని, ఒంటికాలిపై నిల్చొని లవ్ ప్రపోజ్ చేశానంటున్నాడు.

ఏప్రిల్ 15న నితిన్-షాలిని ఎంగేజ్ మెంట్ ఉంటుంది. ఆ మరుసటి రోజే దుబాయ్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారు. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో హైదరాబాద్ లో సినీ-రాజకీయ ప్రముఖులకు పార్టీ ఇవ్వబోతున్నాడు నితిన్.