నితిన్ యాక్షన్ షురూ

Friday,January 06,2017 - 01:14 by Z_CLU

దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ తరవాత నితిన్ సెట్స్ పైకి వచ్చాడు. నితిన్ ఒకడే కాదు ‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’ తరవాత డైరెక్టర్ హను రాఘవపూడి, ఆ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కూడా 8 నెలల గ్యాప్ తరవాతే ఇప్పుడు సెట్స్ పైకి వచ్చారు.

గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన అ..ఆ… సినిమా సక్సెస్ తరవాత అంత ఈజీగా మరో సినిమాకి సంతకం చేయని నితిన్, ఈసాారి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో సెట్స్ పైకి వచ్చాడు. ఫస్ట్ డే కాస్తంత ఎగ్జైటెడ్ గా, మరికాస్త కంగారుగా ఉందని ట్వీట్ చేసిన నితిన్, ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సక్సెస్ అవ్వడం మాత్రం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.