ఆమెకు 3 కోట్లు ఆఫర్ చేసిన నితిన్?

Friday,August 07,2020 - 05:58 by Z_CLU

ప్రస్తుతం నితిన్ చేతిలో 4 సినిమాలున్నాయి. అన్నీ అతడికి ఇష్టమైన ప్రాజెక్టులే. అయితే ఓ ప్రాజెక్టును మాత్రం అతడు చాలా సీరియస్ గా, అంతే ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అదే అంథాధున్ రీమేక్.

తన సొంత బ్యానర్ (శ్రేష్ఠ్ మూవీస్)పై ఈ రీమేక్ ను ఆల్రెడీ లాంచ్ చేశాడు నితిన్. ప్రాజెక్టు బాధ్యతల్ని దర్శకుడు మేర్లపాక గాంధీకి అప్పగించాడు. అయితే సినిమాలో కీలకమైన ఓ పాత్రకు మాత్రం హీరోయిన్ సెట్ అవ్వడం లేదు.

అంథాధున్ లో టబు కీలక పాత్ర పోషించింది. ఇంకా చెప్పాలంటే విలన్ పాత్ర ఆమెదే. అలాంటి పాత్ర కోసం ఇప్పుడు నయనతారను సంప్రదించారు మేకర్స్. నయన్ కు 3 కోట్లు ఇవ్వడానికి నితిన్ ముందుకొచ్చాడట. కానీ నయన్ మాత్రం ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది

నిజానికి ఈ సినిమా కోసం ముందుగా టబునే తీసుకోవాలనుకున్నారు. చేసిన పాత్ర మళ్లీ చేయనని ఆమె చెప్పడంతో అనసూయను అనుకున్నారు. తాజాగా ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఏకంగా నయనతార కోసం ట్రై చేస్తున్నారట మేకర్స్