దసరాకు నితిన్ కొత్త సినిమా లాంఛ్

Friday,October 04,2019 - 06:02 by Z_CLU

ప్రస్తుతం నితిన్ చేతిలో 2 సినిమాలున్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు మరో సినిమాను కూడా లాంఛ్ చేయబోతున్నాడు. ఈ దసరాకు నితిన్ హీరోగా రంగ్ దే సినిమా లాంఛ్ కాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. కీర్తిసురేష్ హీరోయిన్.

తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి. తన రెండో ప్రయత్నంగా అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాను నితిన్ తో లాక్ చేశాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.

వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా సినిమా సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాలు చేస్తూనే రంగ్ దే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.