నితిన్- నాని ప్రతిష్టాత్మక చిత్రాలు

Saturday,October 07,2017 - 10:07 by Z_CLU

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ప్రెజెంట్ ఓ ఇద్దరు యంగ్ హీరోలు తమ ప్రెస్టీజియస్ మూవీస్ తో త్వరలోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్లెవరో కాదు యూత్ స్టార్ నితిన్.. నేచురల్ స్టార్ నాని. వీరిద్దరి ప్రెస్టీజియస్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం.

 

ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా నితిన్ కి 25వ సినిమా. ఇప్పటి వరకూ 24 సినిమాలతో హీరోగా ఎంటర్టైన్ చేసిన నితిన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా కావడంతో ఈ సినిమాపై జాగ్రత్త వహిస్తూ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు నితిన్. అందుకే తన 25 సినిమాకి కొన్ని కథలు విన్నప్పటికీ కృష్ణ చైతన్య చెప్పిన స్క్రిప్ట్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దీనికి పవన్ త్రివిక్రమ్ సపోర్ట్ కూడా అందుకున్నాడు యూత్ స్టార్. ప్రెజెంట్ షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ ప్రెస్టీజియస్ సినిమాతో నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి మరో సూపర్ హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న నాని ఇప్పటికే హీరోగా 19 సినిమాల్లో నటించి తన 20వ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో  సందడి చేయడానికి రెడీ అవుతున్నా నిజానికి నాని కి ఇది హిట్ రూపంలో ప్రెస్టీజియస్ సినిమా కాకపోయినా నంబర్ పరంగా మాత్రం నేచురల్ స్టార్ కి ఇది స్పెషల్ ఫిలిం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా తన కెరీర్ లో ఓ స్పెషల్ సినిమాగా భావించి దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేస్తూ ఇందులో లక్కీ హీరోయిన్ సాయి పల్లవి తో జత కట్టాడు ఈ యంగ్ హీరో. ఇక నాని నుంచి వస్తున్న 20వ సినిమా కావడంతో ఆడియన్స్ లో కూడా  ఓ మోస్తరు అంచనాలుంటాయి కనుకే ఈ సినిమాకు వేణు శ్రీరామ్ చెప్పిన స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసి సెట్స్ పై పెట్టేశాడు. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ ప్రెస్టీజియస్ సినిమాతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 న థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్నాడు నాని. మరి ఈ స్పెషల్  మూవీ తో నాని ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.