#Nithiin30 - మరో మూవీ స్టార్ట్ చేసిన నితిన్
Monday,December 07,2020 - 11:02 by Z_CLU
హీరో నితిన్ మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. బాలీవుడ్ హిట్ మూవీ Andhadhun Remake లో నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో దుబాయ్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.

మొదటి షెడ్యూల్ లో భాగంగా Nithin–NabhaNatesh మధ్య కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తున్న ఫొటోను నితిన్ షేర్ చేశాడు కూడా.
అంధాధూన్ రీమేక్ లో అంధుడిగా కనిపించబోతున్నాడు నితిన్. ఇందులో కీలకమైన ఓ పాత్ర కోసం తమన్నను తీసుకున్నారు. మిల్కీబ్యూటీ ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కనిపించనుంది. జనవరి నుంచి మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.