అఖిల్ దర్శకుడి తో నితిన్ సినిమా

Friday,September 09,2016 - 07:00 by Z_CLU

 

ఇటీవలే హనురాఘవ పూడి తో రెండో సినిమా చేయబోతున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు అక్కినేని యువ హీరో అఖిల్. కానీ ఆ స్థానం లో కొన్ని రోజులకే విక్రమ్ కుమార్ ఫైనల్ అయ్యాడు. త్వరలోనే విక్రమ్ కుమార్ తో అఖిల్ సినిమాకు సిద్దమవుతుండగా హను రాఘవ పూడి మాత్రం నితిన్ తో తన తదుపరి సినిమాను మొదలెట్టేశాడు. ఇటీవలే ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యువ దర్శకుడు తాజాగా పెళ్లి పీటలెక్కాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విడుదలైన వెంటనే నితిన్ తో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో చేయాల్సి ఉన్నప్పటికీ పెళ్లి కోసమే ఇప్పటి వరకూ సమయం తీసుకున్న ఈ దర్శకుడు తాజాగా నితిన్ తో తెరకెక్కించే సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తరువాత అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతాడట హను.