ఫైనల్ స్టేజ్ లో నితిన్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

Tuesday,November 28,2017 - 11:20 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నితిన్ సినిమా. అయితే మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ పై ఓ కన్నేసిన సినిమా యూనిట్, ఆల్మోస్ట్ సాంగ్స్ ని కూడా ఫైనల్ చేసుకుంది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్వీట్ చేసి మరీ కన్ఫం చేశాడు.

నితిన్ కరియర్ లో ఇది 25 మూవీ కావడంతో డెఫ్ఫినేట్ గా ఇది సమ్ థింగ్ స్పెషల్ మూవీ అనిపించుకోవడం గ్యారంటీ అని ఫిక్స్ అయి ఉన్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ నిర్మించడం ఓ సెన్సేషన్ అయితే, త్రివిక్రమ్ ఈ సినిమాకి స్టోరీ అందించడంతో సినిమా సెట్స్ పైకి వచ్చినరోజే ఈ మూవీ చుట్టూ బోలెడంత హైప్ క్రియేట్ అయింది.

 

‘లై’ మూవీ తరవాత మరోసారి మేఘా ఆకాష్ నితిన్ సరసన జోడీ కడుతుంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ నితిన్ కరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీ కావడం గ్యారంటీ అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. ఈ మూవీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.