నితిన్ ‘లై’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది...

Monday,June 12,2017 - 03:28 by Z_CLU

నితిన్ ‘లై’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది. నిన్న అమెరికాలోని చికాగోలో రిలీజైన ఈ సాంగ్, ఈ రోజు ఇండియాలో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అల్టిమేట్ మాస్ ఎలిమెంట్స్ తో క్లాస్ బీట్స్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్, గతంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజైనప్పుడు క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత పెంచేశాయి.

ప్రస్తుతం U.S. లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉంది. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఒక ఫైట్ కోసం ఏకంగా 100 మంది ఫైటర్స్ తో కంపోజ్ చేసింది ‘లై’ టీమ్.

హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ కరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.