పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ... నితిన్ హ్యాపీ !

Tuesday,February 18,2020 - 12:26 by Z_CLU

పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అయితే హీరోల్లో కూడా పవన్  ఫ్యాన్స్ ఉన్నారు. అందులో హీరో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. ఆ అభిమానంతోనే తన ప్రతీ సినిమాకు పవన్ నుండి విషెస్ అందుకొని ముందుకెళ్తాడు. ఇక నితిన్ సినిమా ఈవెంట్ కి పిలవాలే కానీ రావడానికి ఏ మాత్రం ఆలోచించడు పవన్. వారిద్దరి బాండింగ్ అలాంటిది.

ఆ అభిమానంతో పవన్ రీ ఎంట్రీ గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు నితిన్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాల హ్యాపీ గా ఉంది. ఆయన మాస్ సినిమానే చేయాలనేం లేదు జస్ట్ మాకు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఇక ‘పింక్’ తమిళ్ రీమేక్ తో అజిత్ గారు కూడా మంచి హిట్ కొట్టారు. సో ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్టవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదంటూ తన అభిమానాన్ని మాటల ద్వారా చాటుకున్నాడు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళినా హీరోగా ఆయన ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని హీరోగా సినిమా చేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో కి అదే హంగామా ఉంటుందని అందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నాడు.