Nithin Check - రిలీజ్ డేట్ మారింది

Monday,February 08,2021 - 11:50 by Z_CLU

నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

‘యద్భావం తద్భవతి… అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్‌తో ‘చెక్’ ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత హీరోను జైలులో ఖైదీలా చూపించారు. రెండు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Nithin Check movie release postponed to February 26 2

ముందుగా ఈ సినిమాను 19న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, సీజీ వర్క్స్ పూర్తి కాలేదు. అందుకని, 26కు పోస్ట్ పోన్ చేశారు.

చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి ట్రైలర్ బావుందని ట్వీట్ చేశారు. హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్, హీరోయిన్ కీర్తీసురేష్ తదితరులు ట్రైలర్, అందులో నితిన్ లుక్ పై ప్రశంసలు కురిపించారు.

సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నాడు.