మరో సినిమా స్టార్ట్ చేసిన నితిన్

Sunday,June 23,2019 - 04:01 by Z_CLU

మొన్ననే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు నితిన్. ఇప్పుడు అదే ఊపులో మరో సినిమా స్టార్ట్ చేశాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించబోయే సినిమా లాంఛనంగా మొదలైంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారు.

ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా వారియ‌ర్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. సినిమా ఓపెనింగ్ కు ప్రియావారియర్ వచ్చింది. సంస్థ కార్యాల‌యంలో జ‌రిగిన ముహూర్త‌పు స‌న్నివేశానికి చిత్ర నిర్మాత వి. ఆనంద ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి క్లాప్‌కొట్టారు.

నితిన్-రకుల్ కాంబోలో ఇదే మొదటి సినిమా. అలాగే ఏలేటి-నితిన్ కాంబోలో కూడా ఇదే ఫస్ట్ మూవీ. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కు ఇదే స్ట్రయిట్ తెలుగు మూవీ. కీర‌వాణి  ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

సాంకేతిక నిపుణులు
నిర్మాణం: భ‌వ్య క్రియేష‌న్స్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  చంద్ర‌శేఖ‌ర్ యేలేటి
నిర్మాత‌:  వి. ఆనంద‌ప్ర‌సాద్‌
ఛాయాగ్ర‌హ‌ణం:  రాహుల్ శ్రీవాస్త‌వ్‌
సంగీతం:  కీర‌వాణి
ర‌చ‌నా స‌హ‌కారం, మాట‌లు:  వెంక‌ట్ న‌రేష్ రెడ్డి
ఆర్ట్:  వివేక్ అన్నామ‌లై