జీ ఎక్స్ క్లూజివ్: మరికాసేపట్లో భీష్మ ఎనౌన్స్ మెంట్
Friday,March 29,2019 - 04:39 by Z_CLU
రేపు నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా రేపు భీష్మ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ప్రాజెక్టును ఈరోజే ఎనౌన్స్ చేయబోతున్నారు. మరికాసేపట్లో నితిన్-వెంకీ కుడుముల కాంబోలో భీష్మ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.
ముందుగా హీరోయిన్ రష్మిక, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేయబోతోంది. ఆ తర్వాత నితిన్, వెంకీ కుడుముల, నిర్మాతలు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారు. ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ సందర్భంగా భీష్మ టైటిల్ తో పాటు ఓ చిన్న పోస్టర్ కూడా రాబోతోంది.
ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుమల చేస్తున్న సినిమా ఇదే. ఈ మూవీ కోసం చాలా కష్టపడి హిలేరియస్ యూత్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు వెంకీ. మే ఫస్ట్ వీక్ నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది.