నితిన్ పెళ్లికి డేట్ ఫిక్స్

Wednesday,July 01,2020 - 01:07 by Z_CLU

నితిన్ పెళ్లికి తాజాగా మరో డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 26న వివాహం చేసుకోవాలని నితిన్ నిర్ణయించాడు. లాక్ డౌన్ రూల్స్ కు అనుగుణంగా తక్కువ మంది అతిథుల సమక్షంలో ఓ ఫామ్ హౌజ్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు నితిన్.

ఏప్రిల్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఈ హీరో. ఈ మేరకు దుబాయ్ లో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అదే టైమ్ లో కరోనా విజృంభించడం, లాక్ డౌన్ పడ్డంతో పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పట్లో కరోనా ఎఫెక్ట్ తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఈనెల 26న ఫామ్ హౌజ్ లో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

నితిన్-షాలిని దాదాపు 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. భీష్మ రిలీజ్ టైమ్ లో తన ప్రేమసంగతి బయటపెట్టిన నితిన్.. ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. ఈ నెలలో షాలిని మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు.

ఇంతకుముందు నిఖిల్ కూడా ఇలానే ఫామ్ హౌజ్ లో గుంభనంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నితిన్ కూడా అదే రూట్లో ఉన్నాడు. వచ్చే నెలలో రానా పెళ్లి కూడా ఇలానే సింపుల్ గా జరగబోతోంది.