బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య బాక్సాఫీస్ వార్

Friday,July 31,2020 - 02:02 by Z_CLU

అఖిల్-నితిన్.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఏకంగా అఖిల్ మొదటి సినిమాకు నితిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాక్సాఫీస్ వార్ షురూ కాబోతోంది.

వచ్చే సంక్రాంతి కి బడా హీరోల సినిమాలు లేకపోవడంతో యంగ్ హీరోలు రిలీజ్ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. నితిన్ అప్ కమింగ్ సినిమా ‘రంగ్ దే’ వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో సంక్రాంతి విడుదల అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

ఇక అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా సంక్రాంతి కే రానుంది. ఇటివలే ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసారు మేకర్స్.

సో వచ్చే ఏడాది ‘రంగ్ దే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరి సినిమాలు ఇలా ఒకేసారి రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్