బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో నితిన్ సినిమా

Sunday,October 07,2018 - 03:28 by Z_CLU

‘ఛలో’ ఫేం వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్న నితిన్ నెక్స్ట్ సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. ఇటివలే ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి డైరెక్షన్ లో  సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు యూత్ స్టార్. ఇటివలే అజయ్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ వెంకీ కుడుముల సినిమాతో పాటే ఈ సినిమాను కూడా ఫినిష్ చేయాలనీ భావిస్తున్నాడట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.