ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన 'రంగ్ దే'

Wednesday,March 24,2021 - 12:39 by Z_CLU

ఒక సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులకి తెలియాలంటే ఒక వారం పాటు ఆ సినిమాకు సంబంధించి విస్తృతంగా ప్రమోషన్స్ చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ‘రంగ్ దే’ టీం. సినిమాకు సంబంధించి క్లిక్ అయ్యే ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుండే వీడియోస్ రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్న టీం రిలీజ్ కి ముందు ఫన్నీ వీడియోస్ పై మరింత శ్రద్ధ పెట్టి వర్కౌట్ చేస్తున్నారు.

vennela kishore Brahmaji

ముందుగా సుహాస్ , అభినవ్ గోమటం లు ప్రమోషన్స్ కోసం నితిన్ తో మాట్లాడే వీడియోతో మొదలుపెట్టి తాజాగా  వెన్నెల  కిశోర్, బ్రహ్మాజీ ల ఫన్నీ వీడియో రిలీజ్ చేసి ఎట్రాక్ట్ చేశారు. ఇక నితిన్ , కీర్తి సురేష్ , నరేష్ అండ్ టీం ఇప్పటికే టివీ షోస్ కి తిరుగుతూ మరోవైపు ఇంటర్వూస్ కూడా ఇస్తూ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో సినిమాను జనాలకి రీచ్ చేసే ప్రమోషన్స్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ‘రంగ్ దే’ టీం సక్సెస్ సాధించారు. మరి రిలీజ్ తర్వాత సినిమాతో ఎంతటి విజయం అందుకుంటారో చూడాలి.

Also Check Nithin Speech at ‘RangDe’ Prerelease Event