మరికొన్ని గంటల్లో ‘ఛల్ మోహన రంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Sunday,March 25,2018 - 08:51 by Z_CLU

ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘ఛల్ మోహన రంగా’. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. దానికి తోడు ఈ రోజు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా రానుండటంతో ఫ్యాన్స్ లో కౌంట్ డౌన్ బిగిన్ అయింది.

నితిన్ సరసన మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమా బెస్ట్ సమ్మర్ ట్రీట్ కానుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో పాటు సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

అల్టిమేట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రివీల్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటలకు మీ ‘జీ సినిమాలు’ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం  చూడండి.