Nithiin30 రిలీజ్ డేట్ లాక్ !

Friday,February 19,2021 - 12:47 by Z_CLU

నితిన్ ప్రస్తుతం ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలతో పాటు ‘అంధాదున్’ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధి దర్శకత్వంలో నితిన్ సొంత బేనర్ ‘శ్రేష్ట్ మూవీస్’ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు మేకర్స్. జూన్ 11 న సినిమా విడుదల కానుందని ప్రకటించారు.

త్వరలోనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ‘అంధాదున్’  బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి హీరో అయుష్ ఖురానా కి నేషనల్ అవార్డు అందించింది. మరి ఆ కథతో రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఎంతటి విజయం సాధిస్తుందో నితిన్ కి ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి.