నితిన్ అప్ కమింగ్ మూవీస్

Saturday,June 16,2018 - 03:20 by Z_CLU

ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు నితిన్…ఈ సినిమాను దాదాపు ఫినిషింగ్ స్టేజీకి తీసుకొచ్చిన నితిన్ త్వరలోనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తో కలిసి నితిన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు యూత్ స్టార్.

ఈ సినిమాలతో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చంద్రశేకర్ ఏలేటి తో కూడా ఓ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు నితిన్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి డిస్కర్షన్ నడుస్తుందని సమాచారం. ఈ సినిమాల తర్వాత తన ఓన్ బ్యానర్  శ్రేష్ట్ మూవీస్  లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కెరీర్ ను పక్కగా ప్లాన్ చేసుకుంటూ దూసుకెల్తున్నాడు ఈ యంగ్ హీరో .