నితిన్ ఈ ఏడాది కూడా అంతే...

Thursday,June 13,2019 - 11:03 by Z_CLU

ఒకేసారి 3 సినిమాలు అనౌన్స్ చేసేసరికి ఈ ఏడాది నితిన్ నుండి ఖచ్చితంగా 2 సినిమాలు గ్యారంటీ అనుకున్నారు. కానీ వరస చూస్తుంటే నితిన్ ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టుకునేలా ఉన్నాడు.

ఈ నెల 20 నుండి సెట్స్ పైకి రానుంది ‘భీష్మ’ సినిమా. సినిమాని ఎంత స్పీడ్ గా కానిచ్చిన డిసెంబర్ నాటికి గాని రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపించట్లేదు. పోనీ సైమల్టేనియస్ గా ఏమైనా 2 సినిమాలు సెట్స్ పైకి వస్తాయా..? అంటే నితిన్ కి కనీసం ఆ ఆలోచన ఉన్నట్టు కూడా కనిపించట్లేదు.

గతేడాది ఆగష్టులో ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజైతే ఇప్పటి వరకు ‘భీష్మ’ ప్రీ ప్రొడక్షన్ కోసమే స్పెండ్ చేశాడు నితిన్. ఈ సినిమా తరవాత మ్యాగ్జిమం కృష్ణ చైతన్య తో సెట్స్ పై ఉండే ప్లానింగ్ లో ఉన్నాడు. అదే ఆలోచనకే ఇంకా ఫిక్స్ అయి ఉంటే గనక ఈ సినిమా ఖచ్చితంగా 2020 కే.

ఎంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడనే కన్నా, ఫోకస్ మొత్తం సక్సెస్ ఫుల్ సినిమా చేయాలనే ఏ మాత్రం హడావిడి లేకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు నితిన్. దర్శకుడు వెంకీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కే చాలా సమయం కేటాయించాడు.