అరకులో నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ – షూటింగ్ కంప్లీట్

Thursday,July 26,2018 - 07:36 by Z_CLU

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ కంప్లీట్ అయింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా లాస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమా ఆగష్టు 9 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

అరకులో వర్షం పడుతుండగా నితిన్, రాశిఖన్నా కాంబినేషన్ లో రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్స్ ఈ రోజు మధ్యాహ్నానికి ఈ లాస్ట్ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేశారు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలివనున్న ఈ సాంగ్ లో అరకుని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అనిపించుకుంటున్నాయి. దానికి తోడు ‘ఇతడేనా ఇతడేనా…’ సాంగ్ ప్రోమోలో నితిన్, రాశిఖన్నాల కెమిస్ట్రీకి సోషల్ మీడియాలో ఫుల్ మార్క్స్ పడ్డాయి.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ. జె. మేయర్ మ్యూజిక్ కంపోజర్.