నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్ రివ్యూ

Thursday,August 02,2018 - 06:37 by Z_CLU

నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు మహేష్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి సినిమా థీమ్ ని ఎలివేట్ చేసిన ఫిలిమ్ మేకర్స్, దానికి కొనసాగింపుగా ఈ ట్రైలర్ ని మరింత ఇంప్రెసివ్ గా ప్రెజెంట్ చేశారు.

అసలు పెళ్ళంటే ఏంటి..? అనే క్వశ్చన్ తో బిగిన్ అయిన ట్రైలర్ సినిమా పట్ల ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తుంది. హీరో హీరోయిన్స్ లవ్ లో పడటం దగ్గరి నుండి పేరెంట్స్ ని కన్విన్స్ చేసి పెళ్ళి చేసుకోవడమే ఈ సినిమా మూలకథ. అయితే ఆ పెళ్ళి గొప్పతనం, ప్రతి తరం ఒకేచోట కలుసుకోవడం లాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో హైలెట్ అవుతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 9 న గ్రాండ్ గా రిలీజవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మిక్కీ. జె. మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.