నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది

Monday,July 09,2018 - 06:41 by Z_CLU

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది. పెళ్ళి గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ కంపోజ్ అయిన ఈ సాంగ్, సినిమా మెయిన్ థీమ్ ని ఎలివేట్ చేస్తుంది.S.P. బాల సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట, సోషల్ మీడియాలో మోస్ట్ ఎట్రాక్టివ్ లా ఎలిమెంట్ లా మారింది.

సినిమాలో సరిగ్గా పెళ్ళి సందర్భంలో ఉండబోయే ఈ సాంగ్ లో ఒక్కొక్కటిగా దేవుళ్ళ పెళ్ళిళ్ళను ప్రస్తావిస్తూ, పెళ్ళి గొప్పతనాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు ఫిల్మ్ మేకర్స్. ఈ సాంగ్ కి మిక్కీ. జె. మేయర్ ట్యూన్ ఎంత ఇంప్రెసివ్ గా ఉందో, శ్రీమణి రాసిన లిరిక్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది.

ఆగష్టు 9 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. నితిన్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.