హృతిక్ డాన్స్ ను రిపీట్ చేసిన నితిన్

Friday,December 27,2019 - 09:13 by Z_CLU

టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఒకడు నితిన్. ఇక బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ను మించిన డాన్సర్ లేడనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి హృతిక్ స్టెప్ ను నితిన్ వేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి సందర్భమే ఒకటి వచ్చింది.

 

చూశారుగా.. ఈ వీడియోలో హృతిక్ మూమెంట్ ను నితిన్ రిపీట్ చేశాడు. కేవలం నితిన్ మాత్రమే కాదు, పక్కనే రష్మిక కూడా చేరడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

రీసెంట్ గా వార్ సినిమా చేశాడు హృతిక్. అందులో ఓ సాంగ్ లో హృతిక్ డాన్స్ చేశాడు. ఆ డాన్స్ మూమెంట్ చాలా పాపులర్ అయింది. దాన్నే నితిన్ మరోసారి చేసి చూపించాడు. హృతిక్ పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.

ఇటలీలోని పోసిటోనాలో నితిన్ హీరోగా ప్రస్తుతం భీష్మ షూటింగ్ జరుగుతోంది. ఇదే లొకేషన్ లో వార్ సినిమా షూటింగ్ కూడా జరిగింది. అందుకే నితిన్ ఇలా వార్ సినిమా స్టెప్ ను రిపీట్ చేశాడు.