టీజర్ తో నితిన్ రెడీ...

Sunday,July 09,2017 - 02:10 by Z_CLU

లేటెస్ట్ గా ‘అ ఆ’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న నితిన్ ప్రెజెంట్ హను రాఘవపూడి డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా ‘లై'(లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి జులై 11 ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లవ్, ఇంటెలిజెన్స్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ప్రెజెంట్ ఈ సినిమాలోని ఎన్‌మిటి తో కూడిన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. నితిన్ సరసన మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీ రోల్ లో నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జులై 11న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోకి, విలన్‌కి మధ్య వున్న ఎనిమిటిని తెలిపే పోస్టర్‌ను జూలై 10న రిలీజ్‌ చేస్తున్నారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్ లోకి రానుంది.