మరో సినిమా ఫైనలైజ్ చేసుకున్న నితిన్

Sunday,November 04,2018 - 02:10 by Z_CLU

త్వరలో వెంకీ కుడుమల డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న నితిన్ ఈ గ్యాప్ లో మరో సినిమాను కూడా ఫైనలైజ్ చేసుకున్నాడు. త్వరలోనే కుమారి 21f ఫేం సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు నితిన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సుకుమార్ కథను అందిస్తున్నాడు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ , గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించనున్నాడని సమాచారం. గోపి సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.