కొత్త లుక్ తో హల్చల్

Saturday,January 21,2017 - 01:40 by Z_CLU

యంగ్ హీరో నితిన్ సరి కొత్త లుక్ తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా ‘అ ఆ’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ప్రెజెంట్ హను రాఘవ పూడి దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

nithiin-look-for-hanuraghavapudi
అయితే ఇప్పటి వరకూ కనిపించని ఓ డిఫరెంట్ లుక్ లో ఈ సినిమాలో  కనిపించి ఎంటర్టైన్ చేయబోతున్నాడట నితిన్. మొన్నటి వరకూ గ్లామర్ లుక్ లో కనిపించి ఎంటర్టైన్ చేసిన   నితిన్  ఈ సినిమా కోసం గడ్డం పెంచి ఓ డిఫరెంట్ లుక్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు . ప్రెజెంట్  భారీ గడ్డం తో నితిన్ సరి కొత్త లుక్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. మరి ఈ లుక్ తో సిల్వర్ స్క్రీన్ పై నితిన్ ఎలా మెస్మరైజ్ చేస్తాడో? చూడాలి.